Ghosty : 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ మధ్యలో కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది కాజల్. కరోనా సమయంలో సడెన్ గా ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది కాజల్. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టడంతో ఇన్ని రోజులు సినిమాలకు దూరంగానే ఉంటూ చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా వదిలేసుకుంది.
ప్రస్తుతం కాజల్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాను అని తానే ప్రకటించింది. అలాగే కాజల్ ఇప్పటికే నటించిన తమిళ్ సినిమా పారిస్ పారిస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. వీటితో పాటు కరుంగాపియం అనే ఓ తమిళ సినిమా ఒప్పుకుంది కాజల్. అలాగే బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో కూడా కాజల్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా కాజల్ నటించిన ఘోస్టీ అనే తమిళ సినిమా రిలీజ్ కి రెడీ అయింది.
Shobu Yarlagadda : బాహుబలి నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పిన పఠాన్ చిత్రయూనిట్..
కాజల్, యోగిబాబు ముఖ్య పాత్రలో, కాజల్ పోలీసాఫీసర్ గా నటించిన ఘోస్టీ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఘోస్టీ సినిమా మార్చ్ 17న రిలీజ్ కాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అని, ఫుల్ గా నవ్వుకోవచ్చని చిత్రయూనిట్ తెలిపింది. దీంతో ఘోస్టీ సినిమా కాజల్ కి కంబ్యాక్ సినిమాగా మారనుంది. తమిళ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కాజల్ కి ఏ రేంజ్ కంబ్యాక్ ఇవ్వనుందో చూడాలి. కాజల్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Get ready for the endless, comedy rolls coaster ride ??#Ghosty releasing in theatres on March 17th.
Starring @MsKajalAggarwal @iYogiBabu
A @samcsmusic Musical
@Kalyaandirector @Sudhans2017 @Jayaram_gj @seedpictures1 @ksravikumardir @editorvijay @jacobcamkid @DoneChannel1 pic.twitter.com/NONJrxa1w2— Ramesh Bala (@rameshlaus) March 5, 2023