Kajol – Shah Rukh Khan : ‘పఠాన్’ సినిమావి ఫేక్ కలెక్షన్స్ అంటున్న హీరోయిన్ కాజోల్..
పఠాన్ సినిమాతో షారుఖ్ కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా 1000 కోట్లతో బాలీవుడ్ పరిశ్రమని కూడా ఆదుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ కలెక్షన్స్ ఫేక్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్ కాజోల్.
- gum 95921
- Published On : July 16, 2023 / 07:22 AM IST
Kajol viral comments on Shah Rukh Khan Pathaan collections
Kajol – Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. పఠాన్ (Pathaan) సినిమాతో చాలా కాలం తరువాత హిట్టు అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో తాను కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా బాలీవుడ్ పరిశ్రమని కూడా ఆదుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. గత కొంత కాలంగా ఒక్క హిట్టు కోసం బాలీవుడ్ చాలా ట్రై చేసింది. తన బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయడానికి అనేక ఇబ్బందులు పడింది. అలాంటి సమయంలో పఠాన్ 1000 కోట్ల మార్క్ ని అందుకొని బాలీవుడ్ కి కొంచెం ఊరటని ఇచ్చింది.
Sai Pallavi : సాయి పల్లవి అమర్‌నాథ్ యాత్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు..
అయితే కలెక్షన్స్ ఫేక్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఈ మూవీ భారీ వ్యతిరేకత మధ్య రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ 1000 కోట్ల మార్క్ అందుకోవడానికి కూడా టికెట్స్ రేట్స్ తగ్గించి, ఏవేవో చేసి చివరికి తమ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసాం అని నిరూపించుకున్నారు. అయితే ఈ మూవీకి సౌత్ లో పెద్ద మార్కెట్ జరిగిందే లేదు. అంతేకాదు మూవీ స్టోరీ కూడా పెద్ద చెప్పుకోదగ్గది కూడా కాదు. రొటీన్ కమర్షియల్ స్టోరీ. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ ఫేక్ అంటూ గట్టి కామెంట్సే వినిపించాయి.
VD13: సంక్రాంతిని టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ.. VD13 షూటింగ్ మొదలు
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఈ మూవీ కలెక్షన్స్ ఫేక్ అంటూ స్వయంగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న కాజోల్, షారుఖ్ గురించి మాట్లాడుతూ.. “పఠాన్ నిజంగా ఎంత కలెక్ట్ చేసింది” అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ KRK ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ వర్గం వాళ్లే పఠాన్ కలెక్షన్స్ ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తుండడంతో సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
Kajol is making fun of #Pathaan business. Means Ajay must be discussing with her at home that @iamsrk has given fake collections. This is the real face of Bollywood. pic.twitter.com/12bvOIF4X7
— KRK (@kamaalrkhan) July 15, 2023
