Prabhas : ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ వర్క్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మూవీ టీం పని చేస్తుంది. ఈక్రమంలోనే ప్రభాస్ కూడా ఈ మూవీ ప్యాచ్ వర్క్స్ లో పాల్గొంటూ చిత్ర యూనిట్ కి సహకరిస్తూ వస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్ లో ఉన్న ప్రభాస్ ని కొందరు అభిమానులు కలుసుకోగా.. డార్లింగ్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఆ పిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ పిక్ లో ప్రభాస్ లాంగ్ హెయిర్, బరువుతగ్గి ఒకప్పటి డార్లింగ్ ని గుర్తుకు చేస్తున్నారు. ఇక ఈ పిక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్.. ఏమున్నాడురా బాబు అంటూ కామెంట్స్ చేస్తూ పిక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ ఈ పిక్ చూసి.. యానిమల్ మూవీలో రణ్‌బీర్ లుక్ లా ఉంది. కొంపదీసి ఇది స్పిరిట్ కోసం చేసిన టెస్ట్ లుక్..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also read : Kalki 2898 AD : నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ విషెస్.. కల్కి సినిమా గురించి కామెంట్స్..
#Prabhas – #Kalki2898AD Look 🥵🥵🥵🔥🔥🔥🔥 pic.twitter.com/CVeeGWg1h4
— GetsCinema (@GetsCinema) April 23, 2024
Annaaaa……..🕺🏻🔥🤩🥳#Prabhas pic.twitter.com/qK4TNEAf5c
— REBEL STAR 👑 (@rebelismmx) April 23, 2024
ఇక కల్కి విషయానికి వస్తే.. ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎలక్షన్స్ వల్ల పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ టీం ఓ పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తున్నారు. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాని జూన్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.