Kalki 2898 AD : నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ విషెస్.. కల్కి సినిమా గురించి కామెంట్స్..

నాగ్ అశ్విన్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రభాస్. అలాగే కల్కి సినిమా గురించి మాట్లాడుతూ..

Kalki 2898 AD : నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ విషెస్.. కల్కి సినిమా గురించి కామెంట్స్..

Prabhas birthday wishes to Kalki 2898 AD movie director nag ashwin

Updated On : April 23, 2024 / 2:37 PM IST

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. హిందూ పురాణాలను ఫ్యూచరిస్టిక్ సినిమా తరహాలో చూపిస్తూ ప్రపంచ ఆడియన్స్ కి మన కల్చర్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా కథని మహాభారతంతో మొదలుపెట్టి.. హిందూ పురాణాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్య పాత్రలని సూపర్ హీరోలుగా చిత్రీకరిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

దీంతో ఈ చిత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా..? ఎప్పుడు చూస్తామా..? అని ప్రేక్షకులంతా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా రీసెంట్ గా మూవీ నుంచి అమితాబ్ కి సంబంధించిన ప్రోమోని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి వావ్ అనిపించారు. కాగా నేడు దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు. దీంతో ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఆడియన్స్ భావించారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు.

Also read : Vijay Deverakonda : పెళ్లి వేడుకలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ గార్డ్ పెళ్ళికి ఫ్యామిలీతో కలిసి..

అయితే నాగ్ అశ్విన్ కి విషెస్ తెలియజేస్తూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. “అద్భుతమైన దర్శకుడు నాగ్ అశ్విన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్కి విషయంలో నీ విజన్ నాకు స్ఫూర్తిని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Prabhas birthday wishes to Kalki 2898 AD movie director nag ashwin

మే 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఎలక్షన్స్ వల్ల పోస్టుపోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొత్త డేట్ మీద మాత్రం ఇప్పటి వరకు ఓ క్లారిటీ రాలేదు. జూన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి.