Vijay Deverakonda : పెళ్లి వేడుకలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ గార్డ్ పెళ్ళికి ఫ్యామిలీతో కలిసి..

తాజాగా తన పర్సనల్ గార్డ్ రవి పెళ్లి జరగడంతో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు.

Vijay Deverakonda : పెళ్లి వేడుకలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ గార్డ్ పెళ్ళికి ఫ్యామిలీతో కలిసి..

Vijay Deverakonda attend his Personal Guard Ravi Marriage with his Family

Updated On : April 23, 2024 / 1:33 PM IST

Vijay Deverakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి సినిమా వర్క్ తో బిజీగా ఉన్నాడు. విజయ్ మామూలుగానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కరోనా ఆసమయంలో కూడా ఎంతోమందికి అండగా ఉన్నాడు. ఇక తన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా తన ఫ్యామిలీలో మెంబర్స్ లాగా బాగా చూసుకుంటారు విజయ్.

Also Read : Sundeep Kishan : మొదలైన సందీప్ కిషన్ ధమాకా కాంబో సినిమా.. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షురూ..

తాజాగా తన పర్సనల్ గార్డ్ రవి పెళ్లి జరగడంతో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. నూతన దంపతులను విజయ్ తల్లితండ్రులు ఆశీర్వదించి బహుమతులు అందించారు. ఇక విజయ్ కి అక్కడి పెద్దలు సన్మానం చేసి కత్తి బహుకరించారు. దీంతో విజయ్ ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం విజయ్, అతని పేరెంట్స్ తన పర్సనల్ గార్డ్ రవి పెళ్ళికి వెళ్లి ఆశీర్వదించిన వీడియో వైరల్ గా మారింది.