MAD Movie Teaser : ఇంజనీరింగ్ పోరలు రచ్చ.. ‘మ్యాడ్’ మూవీ టీజర్ చూసి మ్యాడ్ అవ్వాల్సిందే..

హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం, కేరింత సినిమాల తరువాత మళ్ళీ ఇప్పుడు తెలుగులో ఒక కాలేజీ లైఫ్ స్టోరీని నిర్మాత నాగవంశీ సిద్ధం చేశాడు. 'మ్యాడ్' మూవీ టీజర్..

Kalyan Shankar Naga Vamsi MAD Movie Teaser released

MAD Movie Teaser : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫ్యార్చూన్‌ ఫోర్ సినిమాస్ సంస్థలు వరుస సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని రెడీ చేస్తున్నారు. తెలుగులో కాలేజీ స్టూడెంట్స్ లైఫ్ బ్యాక్ డ్రాప్ తో కథలు వచ్చి చాలా కాలం అయ్యింది. హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం, కేరింత సినిమాలు యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ఇటీవల ‘బాయ్స్ హాస్టల్’ ఒక దుబ్బింగ్ మూవీ కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.

Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ పార్టీ పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు..

కాగా చాలా గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు తెలుగులో అలాంటి ఒక కాలేజీ లైఫ్ స్టోరీని నిర్మాత నాగవంశీ సిద్ధం చేశాడు. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, గౌరీ ప్రియా రెడ్డి, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్.. తదితరులు ముఖ్య పాత్రల్లో ‘మ్యాడ్’ అనే చిత్రాన్ని నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యతో కలిసి నిర్మించాడు. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. నేడు ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది.

Urvashi Rautela : నిమిషానికి కోటి రూపాయ‌లు.. అమ్మడిని ట్రోల్ చేస్తున్న నెటీజ‌న్లు

కాలేజీ డేస్, హాస్టల్ డేస్, ర్యాగింగ్, గొడవలు.. ఇలాంటి విషయాలన్నీ తీసుకోని దర్శకుడు కళ్యాణ్ యూత్ ని ఆకట్టుకునే చిత్రీకరించినట్లు తెలుస్తుంది. భీమ్స్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం తెలియజేయలేదు. మరి ఆ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు