Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ పార్టీ పై విచారణ వేగవంతం చేసిన పోలీసులు..
టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిన టాలీవుడ్ నిర్మాత.
Drugs Case : హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పై ఎంత నిఘా పెట్టిన ఏదొక రకంగా సిటీలో డ్రగ్స్ రవాణా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సినీ, ఐటీ పరిశ్రమకు చెందిన వారు ఈ మాదకద్రవ్యాల వినియోగంలో ఎక్కువ పాల్గొనడం కనిపిస్తుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ రెండు రంగాల్లోని వ్యక్తులు అనేక సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన సందర్భాలు చూశాం. తాజాగా మరో సినీ నిర్మాత డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ నార్కోటిక్ బ్యూరో డిపార్ట్మెంట్ కి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఈ ఘటన జరిగింది.
Mahesh Babu – Nagarjuna : మహేష్ బాబు పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్.. నాగార్జున వీడియోతో..!
మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో సినీ నిర్మాత వెంకట్ రేవ్ పార్టీ నిర్వహించారు. ఇక మూడు నెలలు నుంచి వెంకట్ పై అనుమానంతో నిఘా పెట్టిన నార్కోటిక్ బ్యూరో.. పక్కా సమాచారంతో నిన్న ఆగష్టు 30 అర్ధరాత్రి అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 804లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఎల్ఎస్డి, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు అనేదాని పై ఇంకా వివరాలు తెలియదు. ఇక ఈ దాడిలో వెంకట్ తో పాటు మరో ఐదుగురు కూడా పోలీసులకు పట్టుబడ్డారు.
ఈ ఐదుగురి బాలాజీ, వెంకటేశ్వర్ రెడ్డి, మురళీ, మధుబాల, మెహక్ గా గుర్తించారు. డ్రగ్స్ పార్టీ గురించి వాట్సాప్ చాటింగ్ కూడా పోలీసులు సేకరించారు. కాగా వీరికి ఈ మాదకద్రవ్యాలు గోవా నుంచి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వారితో వీళ్ళకి సంబంధాలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు. కాగా నిర్మాత వెంకట్, ఇప్పుడు దొరికిన బాలాజీ పేరులు గతంలో కూడా డ్రగ్స్ కేసులో వినిపించినట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే తనపై నిఘా ఉంచినట్లు తెలుస్తుంది. ఢమరుకం, ఆటోనగర్ సూర్య, పూలరంగడు, లవ్లీ.. వంటి సినిమాలకు వెంకట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.