Kamakshi Bhaskarla : సత్యం రాజేష్ పక్కన చేసిందని పెద్ద సినిమాలో రిజెక్ట్ చేసారంట.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Kamakshi Bhaskarla)

  • Published on- August 13, 2026 / 01:18 PM IST

Kamakshi Bhaskarla

Kamakshi Bhaskarla : మన తెలుగు పరిశ్రమలో చిన్న సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి పెద్ద సినిమాల్లో, స్టార్స్ పక్కన అవకాశాలు చాలా రేర్ గా వస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఈ విషయంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రల్లో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కామాక్షి భాస్కర్ల అగధ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Kamakshi Bhaskarla : అగధ అంటూ రాబోతున్న కామాక్షి భాస్కర్ల.. ప్రమోషన్స్‌లో ఇలా చీరలో అందంగా..

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పాత్ర చేసి సక్సెస్ అయితే అన్ని అలాంటి పాత్రలే వస్తాయి. మనం వద్దనుకున్నా అలాంటి సినిమాలు అయితేనే పిలుస్తారు. నన్ను కూడా అలాగే చేస్తారు అనే భయం ఉంది. అందుకే నేను ఇలాంటి సినిమాలకు కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. నెక్స్ట్ పక్కా లవ్ స్టోరీతో రాబోతున్నాను.

ఇక పెద్ద హీరోల సినిమాలు కూడా రావట్లేదు. మన ఇండస్ట్రీలో చిన్న హీరోలు, చిన్న సినిమాలు చేసే వాళ్ళకు పెద్ద సినిమాల్లో అంత తొందరగా ఛాన్సులు రావు. నేను పొలిమేరలో సత్యం రాజేష్ పక్కన నటించానని ఓ పెద్ద సినిమాకు రిజెక్ట్ చేసారు. సత్యం రాజేష్ పక్కన చేసింది ఆ అమ్మాయి వద్దు అని అన్నారు. ఆ మాటలు నా దాకా వచ్చాయి. ఇలా కొన్ని సినిమాలకు రిజెక్ట్ చేసారు అని తెలిపింది. దీంతో కామాక్షి భాస్కర్ల వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Tollywood Actress : చైనాలో డాక్టర్ చదివింది.. హీరోయిన్‌గా వరుస సినిమాలు.. కానీ సొంత కార్ లేదంట ఈ హీరోయిన్ కి..