Kamal Haasan: “పొన్నియిన్ సెల్వన్” సినిమా రిజల్ట్ పై కమల్ సంచలన వ్యాఖ్యలు..
భారీ తారాగణంతో, భారీ వ్యయంతో తమిళనాట భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా "పొన్నియిన్ సెల్వన్". కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తూ తెరకెక్కిచిన సినిమా.. తెలుగు, హిందీ వంటి ఇతర భాషలో సత్తా చాట లేకపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా వివాదం జరుగుతుంది.
- gum 95921
- Published On : October 6, 2022 / 10:56 AM IST
Kamal Haasan Comments on Ponniyin Selvan Movie
Kamal Haasan: భారీ తారాగణంతో, భారీ వ్యయంతో తమిళనాట భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తూ తెరకెక్కిచిన సినిమా.. తెలుగు, హిందీ వంటి ఇతర భాషలో సత్తా చాట లేకపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా వివాదం జరుగుతుంది.
ఈ వివాదంపై కమల్ హాసన్ స్పందిస్తూ.. “సినిమా బాగుంటే ఏ భాష వారైనా ఆదరిస్తారు. మనం ‘శంకరాభరణం’ ఆదరిస్తే వాళ్ళు మన ‘మరో చరిత్ర’ను ఆదరించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక తమిళ చారిత్రక కథ, దానిని ఇతర భాష వారు ఆదరించాలనే నియమం లేదు. దీనికి పోయి ఇతర భాషల ప్రజలను దూషించడం తగదంటూ” ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక గత కొన్ని రోజులుగా ‘బాహుబలి’ని పోలుస్తూ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై ట్రోలింగ్ జరుగుతూ, అది కాస్త తీవ్రంగా మారడంతో.. కమల్ ఈ వివాదాలకు చెక్ పెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందా లేదా అనేది చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికి రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు చెబుతున్నారు.
