Suriya : రోలెక్స్ సర్‌కి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్
కమల్ హాసన్ కి చాలా రోజుల తరవాత భారీ సక్సెస్ రావడంతో ఫుల్ ఆనందంలో ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కి కోటి రూపాయల కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కి...........
- Saketh U
- Updated on- June 10, 2022 / 06:14 PM IST
Kamal Hasan Rolex
Kamal Haasan : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య ‘ఫినిషింగ్ టచ్’ రోల్‌లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసిన సంగతి తెలిసిందే. 200 కోట్ల కలెక్షన్లకి దూసుకెళ్తూ సినిమా రోజు రోజుకి మరింత భారీ విజయం సాధిస్తోంది.
ఈ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణాల్లో ఒకటి సూర్య కూడా. చివరి 3 నిమిషాలే కనిపించిన సినిమాని పైకి లేపాడు సూర్య. సూర్య ఎంట్రీకి హాళ్లు దద్దరిల్లిపోతున్నాయి అంటే ఏ రేంజ్ లో సూర్య ఇంపాక్ట్ ఉందో అర్ధం చేసుకోండి. ఇక సూర్య క్యారెక్టర్ నేమ్ రోలెక్స్ అవ్వడంతో దాదాపు మూడు రోజులు రోలెక్స్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది అంటే జనాలు ఆ క్యారెక్టర్ కి ఎంతగా కనెక్ట్ అయ్యారో తెలిసిపోతుంది. సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ సినిమాకి బాగా ప్లస్ అవ్వడంతో కమల్ హాసన్ స్వయంగా త్వరలో సూర్యతో సినిమా చేస్తున్నాను అని ప్రకటించాడు.
Samrat Prithviraj : అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ప్రకటించిన పలు రాష్ట్రాలు..
కమల్ హాసన్ కి చాలా రోజుల తరవాత భారీ సక్సెస్ రావడంతో ఫుల్ ఆనందంలో ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కి కోటి రూపాయల కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఒక్కొక్కరికి బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా సినిమాకి ఎంతో ప్లస్ అయిన రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్యకి ఆయన బ్రాండ్ కి తగ్గట్టు రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు కమల్. కమల్ స్వయంగా సూర్య చేతికి రోలెక్స్ వాచ్ ని తొడిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rolex
A moment like this makes life beautiful! Thank you Anna for your #Rolex! @ikamalhaasan pic.twitter.com/uAfAM8bVkM
— Suriya Sivakumar (@Suriya_offl) June 8, 2022
