Samrat Prithviraj : అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ప్రకటించిన పలు రాష్ట్రాలు..

అక్షయ్ కుమార్ హీరోగా, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా భారతదేశ రోజుల్లో గొప్పవాడైన పృథ్వీరాజ్ జీవిత కథ ఆధారంగా చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో..........

Samrat Prithviraj : అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ప్రకటించిన పలు రాష్ట్రాలు..

Prithviraj (1)

Samrat Prithviraj :   అక్షయ్ కుమార్ హీరోగా, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా భారతదేశ రోజుల్లో గొప్పవాడైన పృథ్వీరాజ్ జీవిత కథ ఆధారంగా చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా అంతగా ప్రభావం చూపించలేకపోతుంది.

అయితే ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోయినా ప్రశంసలు మాత్రం బాగానే వస్తున్నాయి. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఇక ఈ సినిమా మహమ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి భారతదేశాన్ని రక్షించిన పృథ్వీరాజ్ చరిత్ర కావడంతో కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ప్రకటించారు.

Vikram : విక్రమ్ సినిమా.. థియేటర్లో చెలరేగిన మంటలు.. తగలబడిన తెర..

“సామ్రాట్ పృథ్వీరాజ్” సినిమాపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించగా తాజాగా గుజరాత్ రాష్ట్రం కూడా ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా ట్యాక్సీ ఫ్రీ ప్రకటించే ఆలోచనలో ఉన్నాయని పృథ్వీరాజ్ చిత్ర యూనిట్ తెలిపారు.