Kamal Haasan : 23 ఏళ్ళ క్రితం వివాదం.. మళ్ళీ అదే పని చేసిన కమల్ హాసన్.. పోలీసులకు ఫిర్యాదు..

23 ఏళ్ళ క్రితం ఇదే టైటిల్ తో కమల్ హాసన్ సినిమా ప్రకటించగా అప్పట్లోనే ఈ టైటిల్ వివాదంగా మారింది. (Kamal Haasan)

  • Published on- November 11, 2026 / 05:43 PM IST

Kamal Haasan

Kamal Haasan : ఇటీవల నవంబర్ 7న కమల్ హాసన్ 72వ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ‘సండియార్’ అనే టైటిల్ ని ప్రకటించారు. ఇప్పుడు ఈ టైటిల్ వివాదంగా మారింది. కమల్ హాసన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

23 ఏళ్ళ క్రితం ఇదే టైటిల్ తో కమల్ హాసన్ సినిమా ప్రకటించగా అప్పట్లోనే ఈ టైటిల్ వివాదంగా మారింది. గతంలో తమిళనాడు లోని మధురై, తేని, పలు జిల్లాల్లో ఓ రెండు వర్గాల మధ్య కుల ఘర్షణలు జరిగాయి. అందులో ఓ వర్గంలోని కొంతమంది సికిల్ (ఓ రకమైన కత్తి) పట్టుకొని ఊచకొత కోశారని చరిత్ర. అలా సికిల్ పట్టుకునే ఆ వర్గానికి చెందిన వారిని సండియార్ అని పిలిచేవారు. ఆ పదం వాడితే మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్టే.

Also Read : Megaverse : మెగాస్టార్ ‘మెగావర్స్’ షో.. ఆ ఫ్యామిలీ స్పెషల్ ఎపిసోడ్.. షూటింగ్ పూర్తి..

అప్పట్లో ఈ టైటిల్ వివాదాస్పదం అవ్వడంతో కమల్ హాసన్ అప్పటి సీఎం జయలలితకు షూటింగ్ కి పోలీస్ రక్షణ కావాలని అభ్యర్థించినా తిరస్కరించారు. ఆ టైటిల్ వల్ల అప్పట్లో దక్షిణ తమిళనాడులో మరోసారి వివాదం నెలకొంది. దాంతో ఆ సినిమా టైటిల్ మార్చి విరుమాండి అనే టైటిల్ తో రిలీజ్ చేసారు. తెలుగులో ఆ సినిమా పోతురాజుగా 2004 సంక్రాంతికి రిలీజయి పెద్ద విజయమే సాధించింది.

అప్పట్లో సండియార్ టైటిల్ సృష్టించిన వివాదం గుర్తుండి కూడా మళ్ళీ అదే టైటిల్ తో కమల్ హాసన్ సినిమా ప్రకటించడంతో మరోసారి వివాదం నెలకొంది. ఈ పేరు ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ, కుల ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందని ‘సండియార్’ అనే పదం ఆధిపత్య ధోరణిని, హింసను ప్రోత్సహించేలా ఉందని పుదియ తమిళగం (పీటీ) పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించారు.

Also Read : Rashmika Mandanna : అప్పుడు తెలుగు సినిమాలు చేయనన్న రష్మిక.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

దక్షిణ తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ సినిమా పేరు ఉందని పార్టీ వ్యవస్థాపకుడు కె. కృష్ణస్వామి ఆరోపణలు చేసారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరును తీసుకురావడం కక్షసాధింపు చర్యే అని, ఎంపీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కమల్ హాసన్ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కృష్ణ స్వామి అన్నారు. మరి దీనిపై కమల్ హాసన్ స్పందిస్తాడా మరోసారి సినిమా టైటిల్ మార్చుకుంటారా చూడాలి.