Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ వయసు పెరిగినా ఆయన స్థాయికి మించి.. ఆయన నటనాస్థాయి పెంచే సినిమాలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం కమల్ చేసే సినిమాలన్నీ సెన్సేషనల్ దర్శకులతోనే కావడం విశేషం. ప్రస్తుతం కమల్ చేతిలో ఇండియన్ 2, విక్రమ్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ 2 కరోనా తర్వాత ఆగిపోగా.. ఈ మధ్య శంకర్ మళ్ళీ ఈ ప్రాజెక్టుపై పనిచేసేందుకు సిద్దమైనట్లు కథనాలొస్తున్నాయి. ఇక మరో క్రేజీ సినిమా విక్రమ్. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ విక్రమ్ సినిమా దర్శకుడు.
Bigg Boss 5: చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం?!
కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లు కూడా నటిస్తున్న విక్రమ్ సినిమా మీద పాన్ ఇండియా స్థాయి అంచనాలున్నాయి. ఇప్పటికే రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా మీద ఇండియన్ ఫిలిం మేకర్స్ ఓ కన్నేసి ఉంచారు. ఇక, కమల్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడు. అది కూడా సాదాసీదా దర్శకుడితో కాదు. సెన్సేషనల్ దర్శకుడు పా రంజిత్ తో కమల్ సినిమాకి సిగ్నల్ ఇచ్చాడు.
Poonam Kaur: విడాకులపై పూనమ్ హాట్ కామెంట్స్.. ఎవరి గురించబ్బా?
దర్శకుడు పా రంజిత్ అంటే కోలీవుడ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ దర్శకుడు. హీరోను బట్టి, క్రేజ్ ని బట్టి ఎవరి నుండి ఎంత పిండుకోవాలో బాగా తెలిసిన దర్శకుడు రంజిత్. అటకత్తి, మద్రాస్, రజనీతో కబాలి, కాలా సినిమాలను తెరకెక్కించిన రంజిత్ తాజాగా సారపట్ట సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. అందుకే కమల్ రంజిత్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. విక్రమ్ పూర్తికాగానే ఈ సినిమా మొదలు కానుంది. మరి రంజిత్ కమల్ నుండి ఇక ఏ స్థాయి యాక్టింగ్ రాబడతాడో చూడాలి.