Rashmika Mandanna : విజయ్ ని పెళ్లి చేసుకునే టైంలో.. రష్మిక పాత రిలేషన్ గురించి మాట్లాడిన నటుడు..
రష్మిక మందన్నకు గతంలోనే వేరే నటుడితో ఎంగేజ్మెంట్ అయి బ్రేకప్ అయింది. (Rashmika Mandanna)
- Saketh U
- Published On : February 21, 2026 / 10:18 AM IST
Rashmika Mandanna
Rashmika Mandanna : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ సమయం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. అయితే రష్మిక మందన్నకు గతంలోనే వేరే నటుడితో ఎంగేజ్మెంట్ అయి బ్రేకప్ అయింది. కొన్నాళ్ళు ఈ బ్రేకప్ వార్తల్లో నిలిచినా తర్వాత అందరూ మర్చిపోయారు.(Rashmika Mandanna)
రష్మిక మందన్న తన కెరీర్ ఆరంభంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో కిరాక్ పార్టీ అనే సినిమా చేసింది. ఆ సినిమా సమయంలోనే అతనితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత పలుమార్లు రక్షిత్ శెట్టి ఇన్ డైరెక్ట్ గా రష్మిక గురించి మాట్లాడినా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
Also Read : Allu Sirish : అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ.. స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్.. మళ్ళీ అయ్యప్ప మాలలో చరణ్..
అయితే విజయ్ తో పెళ్లి జరిగే ఈ సమయంలో కన్నడ నటుడు, రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి రష్మిక పాత రిలేషన్ గురించి మాట్లాడాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో.. రష్మిక పెళ్ళికి మాకు ఆహ్వానం వస్తుందని మేము అనుకోవట్లేదు. రష్మిక తో పెళ్లి కానందుకు రక్షిత్ ఏమి బాధపడటం లేదు అని అతనితో ఉండేవాళ్ళందరికి తెలుసు. రక్షిత్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు అని ప్రమోద్ శెట్టి అన్నారు.
రష్మిక పెళ్లి చేసుకోబోతున్న సమయంలో ప్రమోద్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై రష్మిక కానీ, రక్షిత్ కానీ స్పందిస్తారేమో చూడాలి.
Also Read : Lavanya Tripathi : డాక్టర్ చెప్పినా కూడా ప్రగ్నెన్సీలో షూటింగ్ చేసిన మెగా కోడలు.. పాపం వాంతులు, మైగ్రేన్..
