Chethana Raj: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ప్రాణాలు కోల్పోయిన టీవీ నటి
కన్నడ టీవీ నటి చేతన రాజ్ బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదిలారు. సోమవారం మే16న ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె కొద్ది రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైంది.
- Subhan Ali Shaik
- Published On : May 17, 2022 / 04:24 PM IST
Chetan Raj
Chethana Raj: కన్నడ టీవీ నటి చేతన రాజ్ బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదిలారు. సోమవారం మే16న ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె కొద్ది రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊపిరితిత్తుల్లోకి ద్రవాలు అధికంగా చేరాయి. కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయారు. నటి తల్లిదండ్రులు.. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైందంటూ ఆరోపిస్తున్నారు.
సబ్బు యాడ్‌లలో చేతన రాజ్ చాలా ఫ్యామస్ అయ్యారు. మే 16న, కర్ణాటకలోని బెంగళూరులోని రాజాజీనగర్‌లోని శెట్టి కాస్మొటిక్ సెంటర్‌లో ‘ఫ్రీ ఫ్యాట్’ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది.
సర్జరీ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులతో పాటు అనస్థీషియా డాక్టర్ మెల్విన్.. చేతనను సాయంత్రం 5.30 గంటలకు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి గుండె ఆగిపోయిందనే సమస్యతో ట్రీట్మెంట్ ఇవ్వాలని వైద్యులను బెదిరించాడు.
Read Also : పుట్టినరోజే జీవితంలో ఆఖరి రోజు-నటి,మోడల్ అనుమానాస్పద మృతి
వైద్యులు సీపీఆర్ ప్రారంభించి 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ చేతనను బ్రతికించలేకపోయారు. ఐసీయూ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సందీప్, బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చేతన సాయంత్రం 6గంటల 45 నిమిషాలకు మరణించినట్లు ప్రకటించారు. చేతన అప్పటికే మృతి చెందినట్లు శెట్టి కాస్మెటిక్ సెంటర్‌లోని వైద్యులకు తెలిసిందని పేర్కొన్నారు.
