Rishab Shetty: ప్రశాంత్ నీల్, రష్మిక చేసినట్టు మీరు చేయకండి.. రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తున్న కన్నడిగులు..
కన్నడ యాక్టర్ మరియు డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన "కాంతారా" రికార్డుల మోత మోగిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విశ్లేషకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. అయితే కన్నడ అభిమానులు మాత్రం రిషబ్ ని..
- gum 95921
- Published On : October 20, 2022 / 05:55 PM IST
Kannada Fans Requesting Rishab Shetty
Rishab Shetty: కన్నడ యాక్టర్ మరియు డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన “కాంతారా” రికార్డుల మోత మోగిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విశ్లేషకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. అద్భుతమైన నేపథ్యం, గ్రిప్పింగ్ నేరేషన్ తో ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
Kantara : ఫ్లాప్ సినిమాని ఎవరూ లేపలేరు, హిట్ సినిమాని ఎవరూ ఆపలేరు
మొదటిరోజుతోనే బ్రేక్ ఈవెన్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో
గీత ఆర్ట్స్ సమర్పిస్తుండగా, ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. డైరెక్టర్ రిషబ్ శెట్టిని తమ బ్యానర్ లో ఒక సినిమా చేయమని అడిగాను, రిషబ్ కూడా ఓకే అన్నాడని వెల్లడించాడు. దీంతో రిషబ్ తదుపరి ప్రోజెక్ట్ తెలుగు ప్రొడ్యూసర్ తో ఉండబోతున్నట్లు కన్నడలో తెలిసింది.
అయితే కన్నడ స్టార్స్ అంతా.. ఇలా పాన్ ఇండియా సక్సెస్ వచ్చిన తరువాత కన్నడని వదిలి వెళ్ళిపోతే ఎలా అంటూ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. కన్నడ స్టార్స్ అయిన ప్రశాంత్ నీల్, రష్మిక కూడా కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి.. సక్సెస్ వచ్చాక, పక్క భాషలో సినిమాలు చేయడంతో అక్కడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారిలా మీరు చేయకండి అంటూ రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తున్నారు కన్నడిగులు.
