Kantara : ‘కాంతారా’కు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉండబోతోంది.. కానీ..

తాజాగా కాంతారా సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా అని అడగడంతో రిషబ్ సమాధానమిస్తూ....................

Kantara : ‘కాంతారా’కు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ఉండబోతోంది.. కానీ..

There is a sequel and prequel for Kantara Movie

Kantara :  రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి అక్కడ మంచి కలెక్షన్లని సాధించింది. దీంతో గత వారం తెలుగు, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

ఎవరూ ఊహించని విధంగా తెలుగు, హిందీలో కూడా కాంతారా సినిమా భారీ విజయం సాధించింది. హిందీలో ఒక్క రోజులోనే 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే తెలుగులో మూడు రోజుల్లో ఏకంగా 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. తెలుగులో కాంతారా సినిమాని అల్లు అరవింద్ 2 కోట్లకు రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేయగా ఇప్పటికే 10 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రావడంతో ఫుల్ ప్రాఫిట్ వచ్చింది. తెలుగులో కాంతారా సాధిస్తున్న విజయాన్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా గురించి రానా, ప్రభాస్, ధనుష్.. లాంటి స్టార్ హీరోలు, పలువురు సినీ ప్రముఖులు సైతం అభినందిస్తూ ట్వీట్స్ చేయడంతో కాంతారా మరింత పాపులర్ అయింది.

Allu Aravind: “రామాయణం” కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. అల్లు అరవింద్!

వీకెండ్ అయిపోయినా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా కాంతారా సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందా అని అడగడంతో రిషబ్ సమాధానమిస్తూ.. ”కాంతారా సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రీక్వెల్ కూడా ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించడం లేదు. ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ సినిమాల గురించి ఆలోచిస్తాను” అని తెలిపాడు. దీంతో కాంతారా సినిమాకి సీక్వెల్ ఉండబోతోందని క్లారిటీ వచ్చింది.