New Movie Opening : ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ కొత్త సినిమా ఓపెనింగ్.. కన్నడ హీరో తెలుగులో సినిమా..

ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. (New Movie Opening)

  • Published on- August 14, 2026 / 05:45 PM IST

New Movie Opening

New Movie Opening : కన్నడ పరిశ్రమలో సుప్రీమ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై బండి నాగరాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా, ఫిలింఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వీరశంకర్ స్క్రిప్ట్ అందజేశారు.

Also Read : Ameerlog Trailer : ‘అమీర్‌ లోగ్’ ట్రైలర్ చూశారా..? హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో..

సినిమా ఓపెనింగ్ అనంతరం నిర్మాత బండి నాగరాజు మాట్లాడుతూ.. భార్గవ్ కన్నడలో కష్టపడి పేరు తెచ్చుకొని స్టార్ గా ఎదిగారు. ఆయన మా సినిమాలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ షూటింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బెంగళూరు దగ్గర్లో ఒక విలేజ్ లో ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాం అని తెలిపారు.

హీరో, డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ.. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాటలో ఎంత వైబ్ ఉందో మా సినిమాలో కూడా అంతే వైబ్ ఉంటుంది. ఈ సినిమాతో తెలుగులో నా కెరీర్ స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా నిర్మాత నాగరాజు సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ తో పాటు, సీట్స్ లో నుంచి ఎగిరి డ్యాన్సులు చేసే ఐటెం సాంగ్ మా మూవీలో ఉంటాయి అని తెలిపారు.