Peddi: ‘పెద్ది’లో శివన్న పాత్ర వెనుక అసలు కథ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలు నో చెప్పారట

పెద్ది(Peddi) సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుందట.

Kannada star shiva rajkumar special character in ram charan peddi movie

  • పెద్ది సినిమాలో శివరాజ్ కుమార్.
  • స్టార్ హీరోలు వదులుకున్న పాత్ర.
  • జూన్ 4న చరణ్ రాక.

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆయన నటించిన గత చిత్రం ‘గేమ్ చేంజర్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో చరణ్‌ను బుచ్చిబాబు సరికొత్త మేకోవర్‌లో, మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్టు సమాచారం.

Ali: సబ్బుకు లక్ష్మీ పూజ ఏంటి? హిందూ సంఘాల ఆగ్రహం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన అలీ

ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ మొదట ఉపేంద్ర, విక్రమ్ వంటి స్టార్ నటులను సంప్రదించినట్లు సమాచారం. ఈ ఇద్దరికీ పాత్ర, కథ బాగా నచినప్పటికీ నో చెప్పాల్సి వచ్చిందట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం, అదే సమయంలో వేరే సినిమాలు చేస్తుండటం వల్ల పెద్ది సినిమాను వదులుకున్నారట. ఫైనల్‌గా ఆ అవకాశం శివరాజ్ కుమార్‌కు దక్కింది. కన్నడనాట అశేష అభిమాన గణం ఉన్న శివన్న ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల, సినిమాకు కన్నడ మార్కెట్‌లో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

రామ్ చరణ్ తనదైన శైలిలో సత్తా చాటుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న తరుణంలో, ‘పెద్ది(Peddi)’ చిత్రం ఆయన కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. బుచ్చిబాబు ఈ సినిమాను ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారని, ఇది ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ జూన్ 4న విడుదలయ్యే ఈ సినిమా రామ్ చరణ్‌ను మళ్లీ విజయపథంలో నిలబెడుతుందో లేదో వేచి చూడాలి.