Toxic: అప్పుడు తల్లి సెంటిమెంట్.. ఇప్పుడు తండ్రి ఎమోషన్.. యష్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
టాక్సిక్(Toxic) సినిమాలో ఎమోషన్స్ ప్రధానంగా ఆడియన్స్ మనసులను హత్తుకుంటాయట.
- V Santhosh Kumar
- Updated on- April 22, 2026 / 06:43 AM IST
Kannada Star Yash Speaks About the Story of Toxic movie
- టాక్సిక్ సినిమా కథ వివరించిన యష్
- తండ్రీకొడుకుల ఎమోషనల్ హైలెట్ కానుందట
- ఆడియన్స్ న హత్తుకునే ఎమోషన్ ఉంటుందట
Toxic: కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్(Toxic)’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండే భారీ అంచనాలను నెలకొన్నాయి. ఆ తరువాత ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసింది. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో యష్ టాక్సిక్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యష్, ఈ సినిమా కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదని, అంతకు మించిన లోతైన కథాంశం ఇందులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Kriti Sanon: బాబోయ్.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్.. ట్రెండీ ఫోటోలు వైరల్
ఒక ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, విజువల్స్ పరంగాను, కథా పరంగాను ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఇక కేజీఎఫ్ సినిమాలో తల్లి సెంటిమెంట్ ప్రధాన బలంగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ‘టాక్సిక్’ సినిమాలో తండ్రి సెంటిమెంట్ హైలైట్‌గా ఉండబోతోందని సమాచారం. తండ్రి, కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని యష్ హింట్ ఇచ్చారు. యాక్షన్ ప్రియులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటూనే, ప్రతి ప్రేక్షకుడిని కదిలించే బలమైన భావోద్వేగాలు ఈ చిత్రంలో అంతర్లీనంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్‌లకే పరిమితం కాకుండా, పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ, ఎమోషనల్ డ్రైవ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని యష్ వివరించారు. ఈ కొత్త తరహా కథాంశం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మరోసారి అందరికి కనెక్ట్ అయ్యే సెంటిమెంట్ తో వస్తున్న యష్ కేజీఎఫ్ రేంజ్ హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
