Lal Salaam : ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో.. లాల్ సలామ్‌లో రజినీకాంత్, కపిల్ దేవ్..
రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'లాల్ సలామ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
- gum 95921
- Updated on- May 18, 2023 / 09:52 PM IST
Kapil Dev shares screen with Rajinikanth in Lal Salaam movie
Rajinikanth Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ (Jailer) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు తన కూతురు ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా విక్రాంత్, జీవిత రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చాడు రజినీకాంత్.
Jailer Movie: రాజస్థాన్‌లో ఛేజింగ్ చేస్తోన్న జైలర్.. ఫోటోలు లీక్!
ఈ సినిమాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కూడా భాగం కాబోతున్నాడట. ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్ లో కపిల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టిన కపిల్ తో రజినీకాంత్ మాట్లాడుతున్న ఫోటోని రజిని షేర్ చేస్తూ.. “ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ తీసుకు వచ్చిన లెజెండరీ కపిల్ దేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇద్దరి లెజెండ్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూసిన నెటిజెన్స్ ఆ ఫోటోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Salman Khan : టైగర్ 3 సెట్స్ లో సల్మాన్ ఖాన్‌కి గాయం.. పిక్ వైరల్!
కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రజినీకాంత్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజిని మొయ్దీన్ భాయ్‌గా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఏ ఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
