Karan Johar : నా షోకి వాళ్లిద్దరూ రారు.. నేను వాళ్ళని పిలవను కూడా..ఒకప్పటి స్టార్ హీరోయిన్ పై కరణ్ వ్యాఖ్యలు
తాజాగా కరణ్ జోహార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను నా కాఫీ విత్ కరణ్ షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా సార్లు అడిగాను. గతంలోనూ, ఇప్పుడు కూడా అడిగాను. రేఖ మేడం నా షోలో.............
- Saketh U
- Published On : August 26, 2022 / 08:17 AM IST
karan johar
Karan Johar : బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తుంది. ఎప్పటిలాగే కరణ్ తన పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వచ్చేస్ గెస్టులని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ సారి మరిన్ని పర్సనల్ ప్రశ్నలు అడుగుతుండటంతో నెటిజన్లు కరణ్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది తన షోకి పిలిచినా వెళ్లరు. కొంతమందిని కరణ్ పిలవడు. ఇటీవలే హీరోయిన్ తాప్సి కూడా తనని ఆ షోకి కరణ్ పిలవడని కౌంటర్ వేసింది.
తాజాగా కరణ్ జోహార్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను నా కాఫీ విత్ కరణ్ షోకి రావాలని రేఖ మేడమ్‌ను చాలా సార్లు అడిగాను. గతంలోనూ, ఇప్పుడు కూడా అడిగాను. రేఖ మేడం నా షోలో కనబడాలనుకున్నాను. ఇటీవల కూడా రమ్మన్నాను. కానీ ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. తను ఏదో పెద్ద రహస్యం దాస్తుందని, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోవాలని ఆమె అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎన్ని సార్లు అడిగినా ఆమె నో చెప్తూనే ఉండటంతో ఇకపై మళ్ళీ ఆమెను నా షోకి రమ్మని ఆహ్వానించను” అని చెప్పాడు.
”అలాగే నా స్నేహితుడు, గురువు ఆదిత్య చోప్రాను కూడా రమ్మని అడగను, తనని ప్రశ్నలు అడిగేంత తెలివితేటలు నాకు లేవు. ఇక వీళ్ళిద్దరూ నా షోలో ఎప్పటికి రారు” అనే అనుకుంటున్నాను అని కరణ్ తెలిపాడు.
