Rocky Aur Rani Kii Prem Kahaani : బాలీవుడ్‌లో మరో 100 కోట్ల సినిమా.. హిందీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయా..?
కరణ్ జోహార్ దర్శకత్వంలో రణ్‌వీర్, అలియా నటించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. అయితే..
- gum 95921
- Updated on- August 8, 2023 / 04:49 PM IST
Karan Johar Ranveer Singh Alia Bhatt Rocky Aur Rani Kii Prem Kahaani collections
Rocky Aur Rani Kii Prem Kahaani : కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలు అన్ని వరుస పరాజయాలు అందుకుంటూ, అక్కడ సౌత్ సినిమాలు రాజ్యమేలుతూ వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ కి మళ్ళీ ఆ పూర్వవైభవం తీసుకురావడానికి అక్కడి మేకర్స్ అండ్ హీరోలు ఎంతో కష్టపడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ సినిమాతో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ అందించి బాలీవుడ్ నెంబర్ సినిమా స్థానంలో ఉన్న బాహుబలి వెనక్కి నెట్టాడు. ఆ తరువాత అదా శర్మ ‘కేరళ స్టోరీ’ కూడా 300 కోట్ల అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..
తాజాగా ఇప్పుడు మరో సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), అలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన చిత్రం ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’. బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమా జులై 28న రిలీజ్ అయ్యింది. మొదటిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంలో కొంచెం స్లోగా ఉన్న ఈ మూవీ.. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా పుంజుకొని 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది.
Kodali Nani : చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్షన్.. ఇండస్ట్రీలో పకోడీ గాళ్లు..
రెండో వారం పూర్తి చేసుకునేప్పటికీ ఈ మూవీ 105.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ వీకెండ్ కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏమి లేవు. రెండో శనివారం, ఆదివారం, ఆ తరువాత మగళవారం ఆగష్టు 15 కావడంతో మూవీకి కలెక్షన్స్ పరంగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఓవర్ ఆల్ గా ఈ మూవీ ఎంతటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. కాగా బాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయా? అంటే మాత్రం ఇంకా లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్, హీరో, హీరోయిన్ ఉన్న మూవీ 100 కోట్లు అందుకోవడానికి రెండు వారలు పైగా సమయం తీసుకోవడం అంటే బ్యాడ్ టైం నడుస్తున్నట్లే.
