Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ లీడర్స్ కౌంటర్స్.

Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..

Botsa Satyanarayana Perni Nani reaction on Chiranjeevi comments of AP government

Chiranjeevi -YCP Leaders : బ్రో సినిమా (Bro Movie) విషయంలో ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ పై చిరంజీవి నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. ఇక దీని పై వైసీపీ (YCP) నాయకులు ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతూ మీడియా ముందుకు వచ్చి చిరు మాటలకు కౌంటర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. “పకోడిగాళ్లా ప్రభుత్వానికి సలహా ఇచ్చేది” అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రియాక్ట్ అయ్యారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ట్విటర్ లో స్పందించారు.

Kodali Nani : చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్షన్.. ఇండస్ట్రీలో పకోడీ గాళ్లు..

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్..
“పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అని అన్నారని తప్ప నాకు పూర్తిగా తెలియదు. ఆ వ్యాఖ్యలు చూసిన తరువాత పూర్తి స్థాయిలో వాటిపై స్పందిస్తాను. ఏపీలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో అనేది ఆయనే చెప్పాలి. అయితే చిరంజీవి మాటలు బట్టి.. సినీ పరిశ్రమ ఒక పిచుకా అని ఒప్పుకున్నారా?” అంటూ వ్యాఖ్యానించారు.

Chiranjeevi : తమ్ముడు జనసేనానికి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్.. ఇండస్ట్రీతో కూడా సపోర్ట్ చేయిస్తూ..

ఎమ్మెల్యే పేర్ని నాని కామెంట్స్..
“చిరంజీవికి నేను వ్యక్తిగతంగా పిచ్చి అభిమానిని. చదువుకునే రోజుల్లో ఆయన బ్యానర్స్ కి దండలు వేసినవాడిని. వాల్తేరు వీరయ్య 200 ఆడినందుకు ఒక అభిమానిగా నేను ఎంతో సంతోషిస్తాను. నా అభిమాని హీరోకే చెబుతున్నా.. ఆయన పారితోషకాల గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడు ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. సినిమాని సినిమాలా, రాజకీయాన్ని రాజకీయంలా చూస్తే బెటర్. అయినా మేము ఏ ఇతర హీరోల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి.. ఇలా ఎవరిపైనా మాట్లాడిన సందర్భాలు లేవు. సినిమా వాళ్ళు వేరు, పవన్ కళ్యాణ్ వేరు. ఆయన సినిమాలో అంబటి రాంబాబుపై కక్ష సాధింపు కోసం పాత్ర సృష్టించినప్పుడు ఇలాంటివి తప్పదు. మనం మరొకరిని గిల్లినప్పుడు, గిల్లించుకోవాలి కూడా” అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏమన్నారంటే..
“చిరంజీవి కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి పాజిటివ్ గా మాట్లాడతారని మేము అనుకోవడం లేదు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు లేవనే వ్యక్తులు రాష్ట్రంలో నిరుద్యోగులు పొందిన ఉపాధి గురించి పరిశీలన చేసుకోవచ్చు. ప్రత్యేక హోదాపై దశలవారీగా మాట మారుస్తున్న పవన్ కళ్యాణ్ తీరుపై ప్రశ్నించాలి. పాచిపోయిన లడ్డుతో పోల్చిన ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గతంలోనే మాట్లాడారు. సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రితో కూడా భేటీ అయిన చిరంజీవి రాష్ట్ర ప్రగతిపై ఆరోజు కొనియాడారు. రాష్ట్రంలో అమలువుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశం మొత్తం చూస్తుంద”ని అన్నారు.