పేద చిన్నారిని పట్టించుకోని కరీనా..నెటిజన్ల మండిపాటు

  • Publish Date - December 29, 2019 / 08:11 AM IST

మన ముందు ఎవరైనా బిచ్చం వేయండి అని అడుగుతూ..ప్రాథేయపడుతుంటే..ఏం చేస్తాం..చిల్లర ఉంటే వేస్తాం. లేకపోతే..చిల్లర లేదు అనే సమాధానం ఇస్తాం. కానీ చూసీ చూడనట్లుగా పట్టించుకోం. అది చిన్న పిల్లయితే. తోచిన విధంగా సహాయం చేస్తాం. కానీ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన..కరీనా కపూర్ కు పేద చిన్నారిని పట్టించుకోకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

కాళ్లు పట్టుకున్నా..చూసీ చూడనట్లుగా వెళ్లిపోవడానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చి వద్ద చోటు చేసుకుంది. కరీనా – సైఫ్ దంపతుల ముద్దుల కొడుకు తైమూర్ ఆలీ ఖాన్ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా మౌంట్ మేరీ చర్చీకి కరీనా వచ్చారు. ఈ సందర్భంగా కరీనాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు.

జనాల మధ్యలో నుంచి ఓ బిచ్చగాడి కూతురు కరీనా దగ్గరకు వచ్చింది. కాలు పట్టుకుంది. కానీ ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా కొడుకు తైమూర్‌ను ఎత్తుకుని ముందుకెళుతోంది. అక్కడనే ఓ మహిళా పోలీసు బాలికను పక్కకు తీసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలిక వైపు చూసి ఓ నవ్వు నవ్వినా సరిపోయేదని ఒకరు, కనీసం ఆలింగనం చేసుకున్నా అయిపోతుండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

ట్రెండింగ్ వార్తలు