నలభై వయసులో ఇరవై వయ్యారాలతో కవర్ పేజ్‌పై కరీనా హొయలు..

  • Publish Date - August 12, 2020 / 08:06 PM IST

కొంతమంది హీరోయిన్లను చూస్తే వారికి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనిపిస్తుంది.. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది కామన్.. అయితే 30+ దాటినా 40 క్రాస్ చేసినా.. పెళ్లి అయి పిల్లలున్నా కొంతమంది కథానాయికలు మాత్రం ఏ మాత్రం మెరుపు తగ్గకుండా ఉంటారు.

ఈ లిస్ట్‌లో బాలీవుడ్‌ బ్యూటీలు చాలామందే ఉన్నారు. వారిలో కరీనా కపూర్ ఖాన్ ఇప్పటికీ తన ఫిట్‌నెస్‌తో యంగ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తోంది. హీరోయిన్‌గా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కరీనా కవర్ ఫొటోను పబ్లిష్ చేసింది.

ఈ ఫొటోషూట్‌లో ఆమె మరింత అందంగానూ హాట్‌గానూ దర్శనిమిచ్చింది.
పెళ్లి అయి ఒక బాబుకి తల్లి అయినా ఆమెలో ఎలాంటి మార్పూ రాలేదు. అసలు కరీనా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటబ్బా అని కుర్ర హీరోయిన్లు సైతం ఆరా తీస్తున్నారు.

తాజాగా మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నాడని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’.. అని సైఫ్, కరీనా ఓ ప్రకటన విడుదల చేశారు.

దీంతో రెండోసారి కూడా తల్లి కాబోతుంది.. అసలు ఫిజిక్ ఎలా మెయింటెన్ చేస్తుందబ్బా అంటూ ఇతర బాలీవుడ్ భామలు చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనా సినిమా రంగంలో 20 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకోవడం.. ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై హాట్‌గా దర్శనమివ్వడంతో పాటు రెండోసారి తల్లి కాబోతున్నాననే గుడ్‌న్యూస్‌తో కరీనా కపూర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Credit:@therealkareenakapoor