Actor Puneeth Rajkumar : ఏనుగు పిల్లకు పునీత్ రాజ్‌కుమార్ పేరు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 3 వారాలు దాటినా ఆయన అభిమానులు ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
- chvmurthy
- Updated on- November 13, 2021 / 09:04 PM IST
Actor Puneeth Raj Kumar
Actor Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 3 వారాలు దాటినా ఆయన అభిమానులు ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయనకున్న అభిమానులను చూసి చిత్ర పరిశ్రమే నివ్వెర పోయింది. ఆయన చేసిన మంచి పనులను అభిమానులు నిత్యం తలుచుకుంటూనే ఉన్నారు.
కర్ణాటక అటవీ శాఖ అధికారులు ఇంకో అడుగు ముందుకేశారు. శివమొగ్గ సమీపంలోని సక్రెబైలు ఏనుగు శిక్షణ కేంద్రంలోని ఓ గున్న ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ ఏనుగు అంటే పునీత్‌కు ఎంతో ఇష్టమని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరణానికి కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ నెలలో ఈ క్యాంపును సందర్శించిన పునీత్ రాజ్‌కుమార్ మూడు గంటలపాటు అక్కడే ఉండి రెండేళ్ల గున్న ఏనుగుపై విపరీతమైన వాత్సల్యం చూపించి…దానితోనే కాలక్షేపం చేశారని అధికారులు తెలిపారు.
Also Read : Encounter : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్కౌంటర్లో 26మంది మృతి
ఏనుగు పిల్లకు నటుడి పేరు పెట్టడంపై ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ నాగరాజ్ మాట్లాడుతూ.. తాము సాధారణంగా దేవుళ్ల పేర్లే పెడతామన్నారు. సెప్టెంబర్ లో ఏనుగు సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్ లో భాగంగా పునీత్ ఈ గున్న ఏనుగుతో 3 గంటల సమయం గడిపారని తెలిపారు. ఆయన సంస్మరణార్ధం స్థానికులు, సిబ్బంది కోరిక మేరకు పునీత్‌కు ఎంతో ఇష్టమైన ఈ ఏనుగు పిల్లకు ఆయన పేరుపై నామకరణం చేసినట్టు చెప్పారు. ఆయన పేరు పెట్టినందుకు తమకెంతో సంతోషంగా ఉందన్నారు.
