Encounter : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 26మంది మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Encounter : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో 26మంది మృతి

Encounter

Encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు.

Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

ఓవైపు అగ్రనేతల మరణం.. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. గత నెలలోనే మావోయిస్టు అగ్రనేత ఆర్కే చనిపోయారు. ఇప్పుడు కాల్పుల్లో ఏకంగా 26మంది మృతి చెందడం మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బే.

గడ్చిరోలి జిల్లా కోర్చి తాలూకాలోని కోట్‌గుల్ ప్రాంతంలోని ఎలెవెన్‌బట్టి అడవుల్లో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓ పోలీసు బృందం మావోయిస్టులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత బృందం సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. వెంటనే పోలీసు బృందం మావోయిస్టు స్థావరాలకు చేరుకుంది. పోలీసుల రాక సమాచారం అందుకున్న మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా వారిపై దాడికి దిగారు. ఎదురు కాల్పుల్లో 26మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఈ నలుగురు నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది.