Karnataka government key decision over movie ticket rates
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులకు సినిమాలను మరింత చేరువ చేసేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా తమ రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధర గరిష్టంగా రూ.200 మించరాదని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌తోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ ఇదే వర్తిస్తుందని తెలిపింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది.
ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించింది. గతంలో మల్టీఫెక్స్‌ల్లో టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకు ఉన్న సందర్భాలు ఉన్నాయని తెలిపింది. టికెట్ ధరలు అధికంగా ఉండడంతో సామాన్యులు సినిమాలకు వెళ్లడం కష్టం అవుతుందని పేర్కొంది.
Kiara Advani- Sidharth Malhotra : తల్లిదండ్రులైన కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర జంట..
కాగా.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సామాన్య ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్ యజమానులు మాత్రం తమ ఆదాయం పై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం ఫార్మాట్‌లు, ఐమాక్స్, 4డిఎక్స్ వంటివి వాటి కోసం భారీ పెట్టుబడులు పెట్టామని, అన్నింటికి ఒకే ధర నిర్ణయించడం వల్ల నష్టాలు వస్తాయని వారు అంటున్నారు.