Kiara Advani- Sidharth Malhotra : తల్లిదండ్రులైన కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర జంట..
బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు.

Kiara Advani and Sidharth Malhotra welcome baby girl
బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలతో పాటు ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా.. కియారా, సిద్ధార్థ్ జంటకు ఇదే తొలి సంతానం. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే.
Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..
View this post on Instagram
షేర్షా చిత్రంలో సిద్ధార్థ్, కియారా కలిసి నటించారు. 2021లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇటలీలోని రోమ్‌లో సిద్ధార్థ్ తనకు లవ్ ప్రపోజ్ చేసినట్లు కియారా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుంది.
పెళ్లైనప్పటికి కూడా కియారా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పరమ్ సుందరి’ ఈనెల 25న రిలీజ్ కానుంది.