Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో బాహుబలి ఒకటి.

Actor Rana intresting comments on Baahubali The Epic Run Time
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో బాహుబలి ఒకటి. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి మొదటి పార్టు రిలీజై ఇటీవలే 10 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. రెండు భాగాలను కలిపి ఒకే పార్టుగా విడుదల చేయనున్నట్లు చెప్పాడు. బాహుబలి : ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు జపనీస్ భాషలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాగా.. ఈ చిత్రం రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నారు. ఒకరు 5 గంటల 27 నిమిషాల నిడివి ఉందని అంటే.. మరొకరు 4 గంటలే అని అంటున్నారు. తాజాగా ఈ చిత్ర రన్‌టైమ్ పై ఈ సినిమాలో భల్లాల దేవ పాత్రలో అద్భుతంగా నటించిన రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Prabhas : ‘సలార్ 2’ ఇప్పట్లో కష్టమేనా? గ్యాప్ తీసుకోబోతున్న ప్రభాస్ ?
రానా నిర్మాతగా వ్యవహరించిన కొత్త పల్లి చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రానా.. బాహుబలి ఎపిక్ పై మాట్లాడాడు. ఈ చిత్ర రన్‌టైమ్ గురించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదన్నాడు. ఈ విషయం ఒక్క రాజమౌళికే తెలుస్తుందన్నాడు. ఇక ఎంత నిడివి ఉన్నా కూడా తనకు ఆనందమే అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది తాను ఏ చిత్రంలో నటించకపోయినప్పటికి కూడా తనకు బ్లాక్ బాస్టర్ రానుందన్నాడు.