Karthik Subbaraj : తమిళ పరిశ్రమ వెయ్యి కోట్ల కల.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు.. కేజీఎఫ్, పుష్పలతో పోలుస్తూ..
తమిళ పరిశ్రమ మీద ఎప్పట్నించో వెయ్యి కోట్ల ఒత్తిడి ఉంది. (Karthik Subbaraj)
- Saketh U
- Updated on- October 28, 2026 / 01:54 PM IST
Karthik Subbaraj
Karthik Subbaraj : ఒకప్పుడు రీజనల్ సినిమా ఉన్నా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయింది. మంచి సినిమా, భారీ బడ్జెట్ సినిమాలు వేరే భాషల్లోకి కూడా రిలీజ్ చేసి పెద్ద హిట్స్, భారీ కలెక్షన్స్ సాధిస్తున్నారు. ఈ క్రమంలో హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో వెయ్యి కోట్లకు పైగా సాధించిన సినిమాలు ఉన్నాయి. మలయాళం సినిమాలు వాళ్ళ వరకే తీస్తారు కాబట్టి వెయ్యి కోట్లు ఇప్పట్లో అందుకోలేరు అని అందరికి తెలుసు.
కానీ తమిళ పరిశ్రమ మీద ఎప్పట్నించో వెయ్యి కోట్ల ఒత్తిడి ఉంది. గతంలో మణిరత్నం, శంకర్ సమయంలో ఎన్నో తమిళ్ సినిమాలు తెలుగు, కన్నడ, హిందీలో కూడా హిట్ అయ్యాయి. మిగతా భాషల్లో సినిమాలు వెయ్యి కోట్లు కొట్టిన దగ్గర్నుంచి తమిళ్ వాళ్లకు కూడా వెయ్యి కోట్ల సినిమా ఉండాలని పరిశ్రమ వాళ్ళు, ప్రేక్షకులు, తమిళ హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read : Jyoti Poorvaj : కిల్లర్ ఈవెంట్.. చీరకట్టులో మెరిపించిన జ్యోతి పూర్వాజ్.. ఫొటోలు..
ఇటీవల వచ్చిన తమిళ స్టార్ హీరోల సినిమాలు 300 నుంచి 500 కోట్ల వరకు అయితే సాధించగలిగాయి. రీసెంట్ గా వచ్చిన జైలర్ 2 సినిమా 700 కోట్ల దగ్గర ఆగిపోయింది. దీంతో వెయ్యి కోట్ల సినిమా తమిళ్ వాళ్లకు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వెయ్యి కోట్ల కలెక్షన్ పై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసారు.
కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. ఎవరూ వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకొని సినిమా చేయరు. అది జరగాలి దానంతట అదే. తమిళ్ వాళ్ళు మేము వెయ్యి కోట్ల సినిమా చేయాలి అని చేస్తే అవ్వదు. KGF, పుష్ప సినిమాలు హిట్ అవ్వాలని తీశారు కానీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలి అని తీయలేదు. కానీ అవి కలెక్ట్ చేశాయి. వెయ్యి కోట్లు కలెక్ట్ అయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. ఆడియన్స్ ఆ సినిమాలను లైక్ చేసారు. వెయ్యి కోట్లు అనేది ఒక మ్యాజిక్ లాగా అవ్వాలి. మ్యాజిక్ ని మనం ప్లాన్ చేయలేము అని అన్నారు.
Also Read : Avengers: Doomsday : భారత్‌లో ఒక రోజు ముందే రిలీజ్ అవ్వబోతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’..
అయితే తమిళ దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ తో 800 కోట్లతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్లు కొడుతుందని, బన్నీ తెలుగు హీరో అయినా నిర్మాత, దర్శకులు తమిళ్ వాళ్ళు కాబట్టి రాకా తమిళ సినిమా కింద లెక్కేసి వెయ్యి కోట్ల కల తీర్చుకుంటారని మన తెలుగు వాళ్ళే అంటున్నారు.
