కార్తీ, జ్యోతిక అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్న సినిమా ‘దొంగ’ టీజర్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.. సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది..
కార్తీ, జ్యోతిక అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్న సినిమా.. ‘తంబి’.. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టీజర్ శనివారం ఉదయం అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
సూర్య తమిళ్, మోహన్ లాన్ మలయాళ టీజర్ రిలీజ్ చేస్తూ.. మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఒక్కో కేసుకి ఒక్కో పేరు మార్చుకునే దొంగగా కార్తి కనిపిస్తుండగా, అతని కోసం ఎదురుచూసే అక్క పార్వతిగా జ్యోతిక, తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తున్నారు. ‘ప్రేమ అన్నిటినీ మార్చేస్తుంది శర్వా.. నిన్నూ మార్చిందీ, నన్నూ మార్చింది’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
Read Also : రాజా నరసంహా : ‘చాందినీ రాత్’ వీడియో సాంగ్
జ్యోతిక గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. రకరకాల పేర్లతో పలువురిని మోసం చేసిన దొంగ, అక్క కోసం ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ, అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ హైలెట్ అవనుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. గోవింద్ వసంత ఆర్ఆర్, ఆర్.డి.రాజశేఖర్ విజువల్స్ బాగున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.