Ilayaraja: మన శంకరవరప్రసాద్ గారులో ఇళయరాజా పాట.. మరి కాపీ రైట్ కేసు పెడతారా?

మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఇళయరాజా(Ilayaraja) పాట వాడటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Ilayaraja: మన శంకరవరప్రసాద్ గారులో ఇళయరాజా పాట.. మరి కాపీ రైట్ కేసు పెడతారా?

Ilaiyaraaja song in Mana shankaravaraprasad garu movie

Updated On : January 13, 2026 / 8:11 AM IST
  • మన శంకరవరప్రసాద్ గారులో ఇళయరాజా పాట
  • ఈ సినిమాపై ఇళయరాజా కాపీ రైట్ కేసు వేస్తాడా
  • గతంలో పలు సినిమాలకు నోటీసులు పంపించిన ఇళయరాజా

Ilayaraja: ఈ మధ్య కాలంలో మ్యూజికల్ కాపీ రైట్స్ గురుంచి తెగ చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు తాము చేసిన పాటలను తమ అనుమతి లేకుండా వేరే సినిమాలో వాడితే కాపీ రైట్స్ కేసులు పెడుతున్నారు. ఈ వరుసలో మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilayaraja) ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆయన పలుసార్లు తన పాటలను వేరే సినిమాల్లో వాడటంపై కేసులు వేశారు.

ఇదిలా ఉంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా విడుదల అయ్యింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జనవరి 12న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా కంపోజ్ చేసిన దళపతి సినిమాలోని ‘సుదరి.. నేనే నీవంట’ పాటను వాడారు. అది కూడా నాలుగు చోట్ల వాడారు. ఇప్పుడు ఈ న్యూస్ ట్రేండింగ్ అవుతోంది.

Sreeleela: పాపం శ్రీలీల.. భాష మార్చినా ఫలితం మారలేదు.. ఉస్తాద్ భగత్ సింగ్ సంగతేంటో?

ఇళయరాజా ఈ సినిమాపై కూడా కేసు పెడతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. మరి ఈ వార్త ఇళయరాజా వరకు చేరలేదా, లేక మేకర్స్ ఈ సాంగ్ విషయంలో ఇళయరాజా పర్మిషన్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇళయరాజా గతంలో అజిత్ హీరోగా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ, మలయాళ మూవీ మంజుమ్మెల్ బాయ్స్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాల్లో తన పాటలను వాడినందుకు లీగల్ నోటీసులు పంపాడు ఇళయరాజా. ఇక రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ మూవీ టీజర్‌లో తన పాటను వాడినందుకు కూడా ఆయన కేసు వేశాడు. మరి మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయంలో ఇళయరాజ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.