MSVG: MSVG బ్లాక్ బస్టర్.. కారు గిఫ్ట్ కన్ఫర్మ్.. అదేంటి అనిల్ రావిపూడి ఇస్తున్నాడా?

నిర్మాత సాహు గరపాటి(MSVG)కి దర్శకుడు అనిల్ రావిపూడి కాస్ట్లీ కారు గిఫ్టుగా ఇవ్వనున్నాడట.

MSVG: MSVG బ్లాక్ బస్టర్.. కారు గిఫ్ట్ కన్ఫర్మ్.. అదేంటి అనిల్ రావిపూడి ఇస్తున్నాడా?

Director Anil Ravipudi gift a car to producer Sahu Garapati.

Updated On : January 13, 2026 / 9:36 AM IST
  • MSVG కలక్షన్స్ పై పందెం వేసిన అనిల్
  • అమెరికాలో 1 మిలియన్ మార్క్ దాటితే కారు గిఫ్ట్
  • ఇప్పుడు నిర్మాతకు అనిల్ కారు గిఫ్టుగా ఇవ్వాలట

MSVG: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు(MSVG). సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. మహిళలు సైతం సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం, పండగ సీజన్ కావడం బాగా కలిసొచ్చింది.

అయితే, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉండేలా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడికి ఇవ్వాలి. రీ ఎంట్రీ తరువాత చిరంజీవి నుంచి ఆడియన్స్, మరీ ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో అలాగే ప్రెజెక్టు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు అనిల్ రావిపూడి నిర్మాత సాహు గరపాటితో పందెం కాసాడట.

Ilayaraja: మన శంకరవరప్రసాద్ గారులో ఇళయరాజా పాట.. మరి కాపీ రైట్ కేసు పెడతారా?

అదేంటంటే, ఈ మధ్య సినిమాలు విజయం సాధిస్తే దర్శకులకు, ఆ సినిమాకు పని చేసిన వారికి కాస్ట్లీ కార్లు గిఫ్టులుగా ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అలాగే, మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు కూడా అదే జరుగనుంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ వన్ మిలియన్ దాటితే అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారపాటికి కారు కొనిస్తా అని చెప్పాడట. ఇప్పుడు ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్ తోనే 1.2 కలక్షన్స్ ను సాధించింది.

దీంతో, అనిల్ రావిపూడి నిర్మాత సాహుకి కారు ఇవ్వడం మిగిలుంది. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. మరి ఆ లాంఛనాన్ని అనిల్ ఎప్పుడు పూర్తి చేస్తాడు అనేది చూడాలి. అలాగే, ఏ కారు కొనిస్తాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు కలక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం రూ.300 కోట్ల రికార్డ్ ను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.