Venky Anil5 : అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన వెంకీ, కళ్యాణ్ రామ్
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా (Venky Anil5 ) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
- Thota Vamshi Kumar
- Updated on- June 21, 2026 / 05:49 PM IST
KATHI LANTI IDEA VenkyAnil5 NKRAR2 promotion video
Venky Anil5 : విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టిలు కథానాయికలుగానటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండగా షైన్ స్ర్కీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
ఇక సినిమాల ప్రమోషన్స్ విషయంలో ధర్శకుడు అనిల్ రావిపూడి స్ట్రైలే వేరు అన్న సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇటీవల సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్, గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి మరీ ట్యూన్స్ సిద్ధం చేయించారు. ఇక తాజాగా ఓ కత్తితో ఫుల్ హంగామా చేశారు.
Sravanthi Chokarapu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్నయాంకర్ స్రవంతి.. ఫోటోలు
ఎప్పుడూ నేనే ఐడియాలు ఇవ్వాలా అంటూ ఓ పెద్ద కత్తి పట్టుకుని అనిల్ రావిపూడి వచ్చాడు. అక్కడే ఉన్న వెంకటేష్ ఆ కత్తి తీసుకుని అనిల్ బోటనవేలిని కోసి మరీ అతడికే వీర తిలకం దిద్దాడు. ఆ వెంటనే కళ్యాణ్ రామ్.. తాను మరో హీరోని అని తాను కూడా వీరతిలకం దిద్దుతానని చెప్పి, వెంకీ చేసినట్లుగానే చేశారు. ఇక తామేం తక్కువ కాదని, వీర తిలకం మహిళలు దిద్దాలని కృతి శెట్టి, కీర్తి సురేశ్ లు అనగా.. ఎవరో ఒకరు ఆ పని చేయండి ఇద్దరు వద్దు అని అనిల్ అంటాడు. కుదరదని చెప్పి ఇద్దరూ కూడా వెంకీ చేసిన పనినే చేస్తారు. దీంతో అనిల్ భయపడిపోతాడు.
Kirrak Seetha : చీరలో కిరాక్ అందాలు..
ఆ తరువాత ..ఎంత మనది రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం మరీ అంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అంటూ అనిల్ చెప్పిన డైలాగ్‌లు నవ్వులు పూచిస్తున్నాయి. వచ్చే ఏడాది (2027) సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనిల్ తెలిపాడు.
