Kaulas Kota : కౌలాస్ కోట పోస్టర్ లాంచ్.. త్వరలోనే షూటింగ్..

తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Kaulas Kota Movie Poster Launched

Kaulas Kota : అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్‌పై మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సమర్పణలో మాదాల నాగూర్ నిర్మాణంలో పీఎస్పీ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కౌలాస్ కోట’. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్లో నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ పీఎస్పీ శర్మ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. రియ‌ల్ కోట ప్రాంగ‌ణంలోనే షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా? OG నటుడితో వాయిస్ ఓవర్.. పవన్ రాసిన డైలాగ్స్..

దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ.. స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికతతో పాటు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు సన్నివేశాలు ఉంటాయి అని తెలిపారు.