HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా? OG నటుడితో వాయిస్ ఓవర్.. పవన్ రాసిన డైలాగ్స్..

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని రేపు జులై 3 ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా? OG నటుడితో వాయిస్ ఓవర్.. పవన్ రాసిన డైలాగ్స్..

Pawan Kalyan HariHara VeeraMallu

Updated On : July 2, 2025 / 7:25 PM IST

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జులై 24 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని రేపు జులై 3 ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూసారు. పవన్ ట్రైలర్ చూసి అభినందించిన వీడియోని మూవీ యూనిట్ రిలీజ్ చేసారు.

Also Read : Sirish : మరోసారి రామ్ చరణ్ వివాదంలో క్షమాపణలు చెప్తూ క్లారిటీ ఇచ్చిన శిరీష్.. అలాంటిది జన్మలో ఎప్పుడూ చేయను..

టాలీవుడ్ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ నిడివి మూడు నిమిషాల ఒక్క సెకండ్ ఉంటుందని సమాచారం. అలాగే ట్రైలర్ అంతా కూడా వాయిస్ ఓవర్ తోనే ఉంటుందని టాక్. తమిళ్ స్టార్ నటుడు, పవన్ OG లో నటిస్తున్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో హరిహర వీరమల్లు ట్రైలర్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఓ మూడు పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయట. ఆ డైలాగ్స్ ని పవన్ స్వయంగా రాసారని సమాచారం.

దీంతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ ని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా కొన్ని థియేటర్స్ లో షో వేస్తున్నారు.

HariHara VeeraMallu

Also Read : Akhanda 2 : ‘అఖండ’ పాప పెద్దయ్యాక పార్ట్ 2 లో ఇలా.. బాలయ్య వచ్చేది ఈమె కోసమే.. ఈమె ఎవరో తెలుసా?