Akhanda 2 : ‘అఖండ’ పాప పెద్దయ్యాక పార్ట్ 2 లో ఇలా.. బాలయ్య వచ్చేది ఈమె కోసమే.. ఈమె ఎవరో తెలుసా?

ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రని తాజాగా ప్రకటించారు.

Akhanda 2 : ‘అఖండ’ పాప పెద్దయ్యాక పార్ట్ 2 లో ఇలా.. బాలయ్య వచ్చేది ఈమె కోసమే.. ఈమె ఎవరో తెలుసా?

Akhanda 2

Updated On : July 2, 2025 / 5:04 PM IST

Akhanda 2 : బాలకృష్ణ అఖండ నుంచి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25 రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రని తాజాగా ప్రకటించారు.

బాలీవుడ్ లో భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ మల్హోత్రా అఖండ 2 సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించారు. అఖండ పార్ట్ 1 సినిమాలో అఖండ వచ్చి తన ఫ్యామిలీని కాపాడతాడని తెలిసిందే. చివర్లో హిమాలయాలకు మళ్ళీ తిరిగి వెళ్లిపోతుంటే పాప వచ్చి ఆపడంతో పాపకు ఏ కష్టం వచ్చినా వస్తాను అని మాటిస్తాడు.

Also Read : Dil Raju : శ్రీ విష్ణు సినిమా పైరసీ.. నలుగురు అరెస్ట్.. పైరసీ కాపీని ఎంతకు అమ్ముతున్నారో తెలుసా? దిల్ రాజు కామెంట్స్..

బోయపాటి కూడా ఆ పాపకు కష్టం వస్తే మళ్ళీ అఖండ వచ్చి ఏం చేస్తాడు అనే కథాంశంతోనే ఈ సినిమా ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాలో నటిస్తుంది అని ప్రకటించడంతో ఆ పాప పెద్దయ్యాక ఇలా అవుతుందని, ఈమెకు కష్టం రావడంతో అఖండ మళ్ళీ కుటుంబం కోసం వస్తాడని తెలుస్తుంది.

ఈమెని పరిచయం చేస్తూ పాత్ర పేరు జనని అని ప్రకటించారు. అఖండ లో పాప పేరు కూడా జననినే. దీంతో ఆ పాప పెద్దయ్యాక ఇలా చూపించబోతున్నారు అని తెలుస్తుంది. ఈసారి అఖండ 2 సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ ని కూడా మెప్పించడానికి కీలక పాత్రలో హర్షాలీని తీసుకున్నట్టు తెలుస్తుంది.

హర్షాలీ మల్హోత్రా పలు సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు పెద్దయ్యాక హీరోయిన్ గా, కీలక పాత్రల కోసం ట్రై చేస్తుంది. హిందీలో నాస్తిక్ అని ఓ సినిమా చేస్తుండగా తెలుగులో అఖండ 2 తో ఎంట్రీ ఇవ్వబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by 14 Reels Plus (@14reelsplus)

 

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?