Kavitha : రేవంత్ సీఎం అయ్యాడని.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద కోపంగా ఉందన్న కవిత..
ఈ ఈవెంట్లో పాల్గొన్న కవిత వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పై కామెంట్స్ చేసారు. (Kavitha)
- Saketh U
- Updated on- July 14, 2026 / 10:29 AM IST
Kavitha
Kavitha : తాజాగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కవిత ఓ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వెంకట్రామయ్య గారి తాలూకా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కవిత గెస్ట్ గా హాజరైంది. ఈ సినిమాని తెలంగాణ ఫోక్ సింగర్ కోమలి నిర్మిస్తున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న కవిత వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ పై కామెంట్స్ చేసారు.
Also Read : Kavitha : సినీ పరిశ్రమ పెద్దలపై కవిత సంచలన కామెంట్స్.. నేను అధికారంలోకి వస్తే..
ప్రీ రిలీజ్ ఈవెంట్లో కవిత మాట్లాడుతూ.. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేమీ లేదు. అందరికి తెలుసు. చాలా మంచి సాంగ్స్ చేస్తారు. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన మూడు రంగుల జెండా సాంగ్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ ఆ పాట చేసినందుకు నీ మీద కోపం కూడా ఉంది నాకు అని అన్నారు. దీంతో కవిత కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో వైరల్ గా మారాయి.
చరణ్ అర్జున్ సినిమా సాంగ్స్ తో పాటు తెలంగాణ ఫోక్ సాంగ్స్, పొలిటికల్ పాటలను కూడా కంపోజ్ చేస్తారు. తెలంగాణ ఎన్నికల ముందు చరణ్ అర్జున్ రేవంత్ రెడ్డి కోసం మూడు రంగుల జెండా పట్టి.. అనే సాంగ్ ని రాసి కంపోజ్ చేసారు. ఈ పాట పెద్ద హిట్ అయింది. రేవంత్ రెడ్డి పాల్గొనే ప్రతి సభలో ఇప్పటికి ఈ పాట వినిపిస్తుంది. ఈ పాట జనాల్ని ఎక్కువగా ఆకర్షించింది. అందుకే ఈ పాట సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొనే కవిత ఈ వ్యాఖ్యలను చేసారని తెలుస్తుంది.
