Kavitha : సినీ పరిశ్రమ పెద్దలపై కవిత సంచలన కామెంట్స్.. నేను అధికారంలోకి వస్తే..
ఆమె ఆహ్వానం మేరకు కవిత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.(Kavitha)
Kavitha
Kavitha : తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కవిత తాజాగా వెంకట్రామయ్య గారి తాలూకా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. మురళీధర్ గౌడ్, దివిజ ప్రభాకర్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 17 రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలంగాణ ఫోక్ సింగర్ కోమలి నిర్మిస్తున్నారు. ఆమె ఆహ్వానం మేరకు కవిత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కవిత మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాత కోమలి తెలంగాణ సింగర్. ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఆమె వచ్చి నేనే నిర్మించాను సినిమాని రమ్మంటే తన కోసం వచ్చాను. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య చేసిన మూడు రంగుల జెండా సాంగ్ వల్లే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాట చేసినందుకు కోపం కూడా ఉంది నాకు. ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు అంటే అది కూడా హిట్ అవుతుంది. ఈ సినిమా పేరు వెంకట్రామయ్య గారి తాలూకా అన్నారు. తాలూకా అంటే ఏంటో నాకు తెలీదు. మా తెలంగాణలో ఆ పదం ఉండదు. ఆ పదం గురించి కొంచెం ఆలోచించాను.
రాష్ట్రాలుగా కొట్లాడుకున్నా తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలి. తెలుగు సినిమా మనల్ని కలిపే విధంగా ఉండాలి. పరస్పర గౌరవం ఉండాలి. రెండు సంస్కృతులు ఉండాలి. మనం తెలుగు – తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు. మనల్ని ఇంగ్లీష్ వాడు వచ్చి కొడుతున్నాడు. తెలుగు భాషని కాపాడుకోవాలి. కొన్ని రాష్ట్రాలలో చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు రాయితీలు ఇస్తారు. తెలంగాణలో కూడా అది రావాలి. ఓటీటీ వచ్చిన తర్వాత కొత్తవాళ్లకు, చిన్నవాళ్లకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కలిసి ఆ గేమ్ కూడా రిగ్ చేసారు అని తెలుస్తుంది. చిన్న నిర్మాతల పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుంది అని తెలియచేస్తున్నాను. భగవంతుడి దయవల్ల నేను రాష్ట్రాన్ని లీడ్ చేస్తే వేరే రాష్ట్రాల్లో లాగా చిన్న సినిమాలకు పాలసీలను తీసుకొస్తాం అని తెలిపింది. దీంతో కవిత కామెంట్స్ టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
