Kavya Kalyan Ram – Kaala Bhairava : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్ – సంగీత దర్శకుడు.. ఫోటోలు వైరల్..

తాజాగా కావ్య కాల భైరవ పెళ్లి పనులు మొదలయ్యాయి. (Kavya Kalyan Ram - Kaala Bhairava)

  • Updated on- November 7, 2026 / 06:21 PM IST

Kavya Kalyan Ram

Kavya Kalyan Ram – Kaala Bhairava : టాలీవుడ్ లో మళ్ళీ పెళ్లిళ్ల హవా మొదలయింది. ఇటీవలే సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తేజ సజ్జా కూడా నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మరో జంట పెళ్లి పీటలెక్కబోతుంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, బలగం, మసూద.. లాంటి పలు సినిమాలతో హీరోయిన్ గా మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ రెండు నెలల క్రితం సంగీత దర్శకుడు కాలభైరవని ప్రేమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

రాజమౌళి కుటుంబ సభ్యుడు, కీరవాణి పెద్ద కొడుకు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ కూడా కావ్యతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే వీరిద్దరూ క్లోజ్ గా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కొన్ని రోజుల క్రితమే కావ్య వియాత్నంలో తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Aniesh : మొదటి సినిమాకే 40 కోట్ల బడ్జెట్.. ఎన్టీఆర్, నాగార్జున సపోర్ట్.. ఎవరీ కొత్త హీరో..

తాజాగా కావ్య కాల భైరవ పెళ్లి పనులు మొదలయ్యాయి. కావ్య ఇంట్లో ఈ పెళ్లి పనులు మొదలయినట్టు తెలుస్తుంది. కావ్య ఫ్యామిలీతో కాలభైరవ దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. దీంతో కావ్య – కాల భైరవ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాలభైరవ తమ్ముడు శ్రీ సింహ కూడా ఇటీవల మురళి మోహన్ మనవరాలు రాగని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.