Kavya Thapar : ఆడిషన్ కి వెళ్తే రిజెక్ట్ చేసి.. ఆ సినిమా పార్ట్ 2కి కావాలని మరీ ఈ హీరోయిన్ ని తీసుకున్న పూరీ..
డబల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా కావ్య థాపర్ నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి మాట్లాడింది.
- Saketh U
- Published On : August 6, 2024 / 12:49 PM IST
Kavya Thapar Shares Interesting Thing about her regarding Double Ismart Movie
Kavya Thapar : పూరీ జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 డబల్ ఇస్మార్ట్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్.. ఇద్దరు హీరోయిన్స్ ఉండగా డబల్ ఇస్మార్ట్ లో మాత్రం కావ్య ఒక్కతే హీరోయిన్.
డబల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా కావ్య థాపర్ నేడు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి మాట్లాడింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది కావ్య.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా అనౌన్స్.. మరోసారి పోలీసాఫీసర్ గా?
కావ్య మాట్లాడుతూ.. నేను ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఆడిషన్ కి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కి పిలుపు వస్తే వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. పూరి సర్ ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కానీ ఇందులో నేనొక్కదాన్నే అని తెలిపింది. పార్ట్ 1 లో ఇద్దరి హీరోయిన్స్ లో సెలెక్ట్ కాకపోయినా డబల్ ఇస్మార్ట్ లో సింగిల్ హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం కావ్య అదృష్టమే.
ఇక కావ్య థాపర్ ఈ సంవత్సరం ఇప్పటికే ఈగల్, ఊరుపేరు భైరవకోన సినిమాలతో రాగా ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ తో రాబోతుంది. ఆ తర్వాత విశ్వం సినిమాతో రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.
