Keerthy Suresh : డబ్బులు పోయినా పర్లేదు అనుకున్నప్పుడే ఆ పని చేస్తా.. కీర్తి సురేష్ కామెంట్స్..
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (Keerthy Suresh)
- Saketh U
- Published on- October 29, 2026 / 06:11 PM IST
Keerthy Suresh
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగానే ఉంది. పెళ్లి తర్వాత మరింత బిజీగా తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తుంది. ఇటీవలే నాని ది ప్యారడైజ్ సినిమాలో ఏష నాగుల సాంగ్ లో డ్యాన్స్ తో అదరగొట్టేసింది. ఇప్పుడు అక్క అనే వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ లో పలకరించబోతుంది కీర్తి సురేష్. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Aadarsha Kutumbam : నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రేంజ్ లో ఉంటుంది ఆదర్శ కుటుంబం.. వెంకటేష్ కామెంట్స్..
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నేను ఎప్పట్నుంచో కొన్ని కథలు రాసుకున్నాను. నాకు రాయటం అంటే ఇంట్రెస్ట్ ఉంది. కొంతకాలంగా దానిపై వర్క్ చేస్తున్నాను. కానీ దర్శకురాలిగా మారతానో లేదో తెలియదు. నిర్మాతను మాత్రం అవుతాను. నా దగ్గర డబ్బులు పోయినా పర్లేదు అనే స్థాయిలో నేను ఉన్నప్పుడే, డబ్బులు పోయినా పర్లేదు అనుకున్నప్పుడే నేను సినిమా నిర్మాణం గురించి ఆలోచిస్తాను అని తెలిపింది.
