Khushbu Sundar : సీనియర్ నటి, తమిళ బిజెపి నాయకురాలు ఖుష్భుకి కరోనా పాజిటివ్
ప్రముఖ సీనియర్ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన సోషల్ మీడియాలో ''మొత్తానికి కరోనా వచ్చేసింది.....
- Saketh U
- Updated on- January 11, 2022 / 02:30 PM IST
Khushbu
Khushbu Sundar : రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఇటీవల మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. తాజాగా మరో సీనియర్ నటి ఖుష్భు సుందర్ కరోనాకి గురయింది.
Akira Nandan: రేణూదేశాయ్-అకీరా నందన్‌కు కరోనా పాజిటివ్
ప్రముఖ సీనియర్ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన సోషల్ మీడియాలో ”మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ప్రస్తుతం కరోనా లక్షణాలు రావడంతో టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి. అలాగే మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోండి’ అంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది.
