బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మహేశ్ హీరోయిన్

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి బాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్‌లోనే బిజీ అయిపోయింది కియారా. డేట్స్ ఖాళీ లేని కియారా ప్రత్యేకించి హాలిడేకు చెక్కేసింది. రొమాంటిక్ లవ్ లైఫ్ కోసం బాయ్ ఫ్రెండ్ తో ట్రిప్పులకెళ్లొస్తోంది కియారా. 

చిన్న సినిమాలు చేసి పెద్దగా ఫైల్లోకి రాని కియారా 300 కోట్ల కలెక్షన్లు దాటిన కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్) సినిమాలో హీరోయిన్‌గా సూపర్ సక్సెస్ కొట్టింది.  ఆ సినిమా సక్సెస్ బాలీవుడ్లో  వరుసగా అవకాశాలు కూడా సంపాదించి పెట్టింది. 

ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో వైపు లవ్ ట్రాక్ లో కూడా అసలు టైమ్ లేకుండా గడిపేస్తోంది ..బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో ప్రేమాయణం నడిపేస్తోంది. కియారా, సిధ్దార్ద్ ల కాంబినేషన్లో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. వీళ్లిద్దరి రిలేషన్ గురించి ఇప్పటికే బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తున్నా.. వీళ్లు మాత్రం నోరు విప్పట్లేదు. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఫారెన్ లో సెలబ్రేట్ చేసుకుని ఇండియా తిరిగొచ్చారు ఈ హ్యాపెనింగ్ లవర్స్ . 

కియారా ప్రస్తుతం అక్షయ్ సరసన లక్ష్మీబాంబ్ సినిమాతో పాటు  కరణ్ జోహార్ తో కూడా రెండు సినిమాలు, షెహన్షా తో పాటు  కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోమరో సినిమా చేస్తోంది. ఇందూ కీ జవానీ అనే సినిమాకు కూడా సైన్ చేసింది కియారా. అసలు టాలీవుడ్‌లో మహేష్ తో భరత్ అనునేను , రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల తర్వాతే బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి కియారా అద్వానీకు.