×
Ad

Mohan Babu : కిడ్నాప్ చేసారంటూ.. మోహన్ బాబు, మంచు విష్ణుపై కేసు నమోదు..

 తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. (Mohan Babu)

Mohan Babu

Mohan Babu : తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోద్ లను కిడ్నాప్ చేసారని, మోహన్ బాబు విద్యా సంస్థలకు చెందిన వ్యక్తులే కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘ నేతలు ఏఎస్పీకి ఫిర్యాదు చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసారు.(Mohan Babu)

ఈ క్రమంలో కిడ్నాప్ గురైన ఇద్దరు విద్యార్థి సంఘ నేతలను చంద్రగిరి వద్ద పోలీసులు రక్షించారు. ఒక వాహనం, పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి చేసి విచారిస్తున్నారు. తిరుచానూరు పిఎస్ లో మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై, మోహన్ బాబు, విష్ణు, యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ ముగ్గురిపై కిడ్నాప్ కేసు నమోదైంది.

Also Read : Takshakudu : ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘తక్షకుడు’ టీజర్ చూశారా..? అదరగొట్టాడుగా..

అయితే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా విద్యార్థి సంఘ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని SFI జిల్లా కార్యదర్శి అక్బర్, AISF జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌లపై చంద్రగిరి పీఎస్ లో ఫిర్యాదు చేసారు. ప్రచారం ఆపేందుకు తమను రూ.15 లక్షల నగదు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని, యాజమాన్య దిష్టిబొమ్మ దహనం చేస్తామని బెదిరించినట్లు మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతినిధులు ఫిర్యాదుయిలో పేర్కొన్నారు.