Sirivennela Sitaramasastri : సిరివెన్నెల మృతికి గల కారణాలు వివరించిన కిమ్స్‌ ఎండీ డా.భాస్కర్ రావు

సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి గల కారణాలను కిమ్స్ ఎండీ భాస్కర్ రావు మీడియాకు వివరించారు.

Sirivennela Sitaramasastri (2)

Sirivennela Sitaramasastri : సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఈ నెల 24న ఆసుపత్రిలో చేరిన సీతారామశాస్త్రి.. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు చికిత్స అందించిన కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు .. సిరి వెన్నెల మృతికి గల కారణాలను మీడియాకు వివరించారు.

చదవండి : Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

ఆరేళ్లుగా సీతారామశాస్త్రిగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్ కారణంగా ఆరేళ్ళ క్రితమే సగం ఉపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది.. అది జరిగిన కొంతకాలానికే బైపాస్ సర్జరీ కూడా జరిగింది. వారం క్రితం మరోవైపు ఉపిరితిత్తుకి క్యాన్సర్ రావడంతో దాంట్లో కూడా సగం తీసేశారు. ఈ చికిత్స జరిగిన తర్వాత రెండు రోజులు బాగానే ఉన్నారు. 24న అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం కిమ్స్‌లో చేర్చారు. కిమ్స్‌లో రెండు రోజులు వైద్యం అందిస్తే బాగానే కోలుకున్నారు.

చదవండి : Sirivennela Sitaramasastri : సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చిన పాట ఇదే..!

ఊపిరితిత్తు 45 శాతం తీసేశాం కాబట్టి మిగిలిన 55 శాతం ఉపిరితిత్తుకి ఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు భాస్కర్ రావు తెలిపారు. శ్వాస సమస్య తలెత్తడంతో ఎక్మో మిషన్‌పై పెట్టాం. గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నాం. ఇదే సమయంలో ఇన్‌ఫెక్షన్ శరీరమంతా సోకింది. అరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో మృతి చెందినట్లు భాస్కర్ రావు తెలిపారు.