Sirivennela Sitaramasastri : సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చిన పాట ఇదే..!

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...

Sirivennela Sitaramasastri : సిరివెన్నెలను ఇంటిపేరుగా మార్చిన పాట ఇదే..!

Sirivennela Sitaramashashtri (2)

Updated On : November 30, 2021 / 5:07 PM IST

Sirivennela Sitaramasastri : ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన జీవితంలో ఎన్నో మంచి పాటలు రాశారు.. వాటిలో ఓ పాట తన ఇంటిపేరునే మార్చేసింది. ఆ పాటే ఇది.

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం…
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం…ఓం…
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్…
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం……

సరసస్వర సురఝారీగమనమౌ సామవేద సారమిది…
నేపాడిన జీవన గీతం…ఈ గీతం..

విరించినై విరచించితిని ఈ కవనమ్..
విపంచినై వినిపించితిని ఈ గీతమ్….

ప్రార్దిష వీణీయ పైన దినకర మయూహ తంత్రులపైన..
జాగ్రుత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన… 2
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విస్వకావ్యమునకిది భాష్యముగా….

Also SeeSirivennela Sitaramasastri : సిరివెన్నెల రాసిన నిప్పుకణికలాంటి ఆ పాట ఒక్కసారి గుర్తు చేసుకోండి

విరించినై…..

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం…:2:
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే..

విరించినై…..

నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం…. 2
సరసస్వరసురఝారీగమనమౌ సామవేద సారమిది…
నేపాడిన జీవన గీతం…ఈ గీతం..