Kiran Abbavaram : బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య.. స్పెషల్ ప్లేస్ లో శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్న క్యూట్ కపుల్..
తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published On : February 27, 2025 / 12:25 PM IST
Kiran Abbavaram and his Wife Rahasya Gorak Celebrated Shivaratri Rahasya Baby Bump Photo goes Viral
Kiran Abbavaram : యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. త్వరలోనే దిల్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల నెల రోజుల క్రితమే కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ గర్భవతి అయిందని ప్రకటించాడు.
తాజాగా కిరణ్ అబ్బవరం మరోసారి తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. నిన్న శివరాత్రి సందర్భంగా కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరఖ్ తో కలిసి కోయంబత్తూర్ లోని ఆదియోగి ఉన్న ఇషా ఫౌండేషన్ కు వెళ్లారు. భార్యతో కలిసి శివరాత్రిని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేయగా కిరణ్ భార్య బేబీ బంప్ తో కనిపించింది.
దీంతో బేబీ బంప్ తో కిరణ్ అబ్బవరం భార్య అంటూ ఈ జంట ఫోటో వైరల్ గా మారింది. ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
